Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ-బోయపాటి అఖండ-2లో సన్యాసినిగా శోభన!

senior heroine shobhana is going to play the role of a monk in the movie akhanda 2
Advertisement
  • నటసింహం నందమూరి బాలయ్య 'అఖండ 2 – తాండవం'పై భారీ అంచనాలు
  • రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన నిర్మాణ సంస్థ
  • కోట్ల మంది భక్తులు, అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్న దర్శకుడు బోయపాటి శ్రీను
Advertisement
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో అఖండ 2 – తాండవపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసుకోగా, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయింది. అది కూడా మహా కుంభ మేళాలో ప్రారంభం కావడం గమనార్హం. 

షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ.. అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తులు, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలిశామన్నారు. కోట్ల మంది జనాల మధ్య మూవీ చిత్రీకరణ అంటే సాధారణ విషయం కాదని, ఇది చిత్ర యూనిట్‌కు ఒక ఛాలెంజ్ అనే చెప్పాలన్నారు. 

కాగా, ఈ తాజా సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందని.. ఆమె పాత్ర ఓ సన్యాసిని అని టాక్ నడుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 
 
Advertisement
Advertisement
senior heroine shobhana
akhanda 2
Nandamuri bala krishna

More Telugu News